ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనం యూఎస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేదిక:- -ఎస్.వి.రమణా చార్య, సీనియర్ జర్నలిస్ట్
  అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అంటే యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో చూస్తుంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా అధికారమార్పు జరిగే ప్రక్రియ. వ్యక్తుల కంటే వ్యవస్థలకే ప్రాముఖ్యత.చట్టానికి అతీతులు ఎవ్వరూ కాదన్న భావన ఈ వేడుక ద్వారా వ్యక్త మోతుంది.
  అమెరికా తొలి అధ్యక్షుడిగా 1789లో జార్జ్ వాషింగ్టన్ న్యూయార్క్ నగరంలోని ఫెడరల్ హాల్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.ఆ తరువాత  కొంత మంది అధ్యక్షులు ఫిలడెల్ఫియాలో ప్రమాణ స్వీకారం చేశారు. 1801 నుండి వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్ క్యాపిటల్ భవనంలో మరి కొంతమంది అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారంచేశారు.

వేదిక మార్పు…

  1981లో రోనల్డ్ రేగన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత క్యాపిటల్ బిల్డింగ్ వెస్ట్ ఫ్రంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు.అప్పటి నుంచి ఇది ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకార వేదికగా కొనసాగు తున్నది.
చరిత్రిక  ప్రాధాన్యం ఏమిటి ?....
లింకన్ మెమోరియల్,వాషింగ్టన్ మ్యాను మెంట్ ఇక్కడినుంచి చూస్తే ఓకే సరళ రేఖలో కనిపిస్తాయి.ఇవి దేశ ఐక్యతకు సంకేతంగా అమెరికన్ ప్రజలు భావిస్తారు. 
ఇక్కడే అమెరికా అధికార వ్యవస్థలోని మూడు శాఖలు కలిసే ప్రాంతం. ఎగ్జిక్యూటివ్(అధ్యక్షుడు),
లెజిస్లేటీవ్ (కాంగ్రెస్), జ్యుడీషియల్(సుప్రీంకోర్టు) ఈ మూడింటి కలయికతో ఇది గౌరవ నీయమైన స్థలంగా ప్రజలు భావిస్తుంటారు.
  యూఎస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేదికగా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ ను ఎన్నికోవటం రాజకీయంగా,ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా ఉన్నదని పలువురు ప్రశంసిస్తున్నారు.

కామెంట్‌లు