పులుగు పాట:- ---డా.పోతగాని సత్యనారాయణ
(ఒత్తులు లేని బాల గేయం -1)
ఎగిరేదెందుకు పులుగు
ఎగిరితే దూరం తరుగు 

పాడేదెందుకు పులుగు
పాడితే మోదం కలుగు

ఆడేదెందుకు పులుగు
ఆడితే దేహం పెరుగు

వెతికేదెందుకు పులుగు
వెతికితే చీకటి తొలుగు

చదివేదెందుకు పులుగు
చదివితే బతుకే వెలుగు


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుంది