అవి గుంట నక్కలు...!
ఒకటి అదను చూసి ఎగబడి తెగబడి రక్తపాతం సృష్టిస్తూ...
దురాక్రమణకు పాల్పడుతోంది ..!
తీవ్ర వాదాన్ని పెంచి పోషిస్తూ...
మనమీద ప్రయోగిస్తుంది !
అదను చిక్కినప్పుడల్లా ఎన్నెన్నో అమాయక ప్రాణాలను పైశాచికంగా
బలిగొంటూ భయభ్రాంతులను చేసే ప్రయత్నాలు,ఎప్పటికప్పుడే చేస్తుంది...!
మన శక్తియుక్తులకు శత్రుమూకలు స్థావరాలతో సహా నేలమట్టమైతే...,
అష్ట దిగ్బంధనం చేసి మన తడాఖా చూపితే...
అణుబాంబు బూచిని చూపి భయపెట్టాలని భ్రమ పడుతోంది...!
విఫల ప్రయత్నాలెన్నో చేసి చివరికి కాళ్ల బేరానికొస్తోంది...!
అదికూడక...మరోగుంటనక్కను ఆశ్ర యిస్తుంది..!
అది దీనికంటే తెలివైన గుంట నక్క...!
రెండింటితోనూ ఆడు కుని రొట్టెను కాజేసే రకం !
రెచ్చగొట్టి ఆయుధాలమ్ముకుంటూ...
సొమ్ముచేసుకునే తెలివితేటలు ..!!
ఇటు స్నేహం నటిస్తూనే అటు ఆయుధాలను,ధనసహాయాన్ని అందించే కుటిల బుద్ధి...!
సరి... ఇంక కథ ముగిసిపోతుంది అనేసరికి
శాంతి సందేశాలు....!
సీజ్ ఫైరింగ్ మధ్యవర్తిత్వాలు ...!!
పోనీ లే కదా అని ఒప్పుకున్నామా....!
మళ్ళీ దొంగదెబ్బలు,రెచ్చ గొట్టే కాల్పులు...!!
ఎన్నాళ్లు...ఈ రావణ కాష్టం...!?
తాడో,పేడో తేల్చుకోకపోతే...మనశ్శాంతి ఎప్పుడు....?!
ఆదిలో చేసిన ఆ పెద్దల తప్పిదాలకు తప్పదా...ఈ దిన దిన గండం...?!
ఈ అకృత్యాలకన్నిటికీ ముగింపు ఎప్పుడు....?!
ఎప్పుడు...?!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి