నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న 72వ పుస్తకం"శాంతి కపోతం" పుస్తకావిష్కరణ సోమనాథ ప్రేమ మందిరం,రాధాస్వామి ఆశ్రమం ప్రాంగము,ఆలూరు,కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగింది.ప్రముఖ రచయిత్రి,విశ్రాంత మండల విద్యాధికారిణి హత్తిబెళగల్లు రామలింగమ్మ,కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల హిందీ అధ్యాపకురాలు శ్రీమతి యం.పార్వతి,విశ్రాంత డి.ఎస్పీ శ్రీ రంగముని,విశ్రాంత డి.పి.ఓ.శ్రీనివాసులు,శ్రీ వీరస్వామి మరియు విచ్చేసిన ప్రముల చేతుల మీద శాంతి కపోతం పుస్తకావిష్కరణ చేశారు.దీనితో పాటు హత్తిబెళగల్లు రామలింగమ్మ గారి "నా జీవన పథంలో.." పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం కృతికర్త గద్వాల సోమన్న వారి విశేష కృషి గాను సత్కరించారు.ఈ కార్యక్రమంలోపద్య కవి ఈశ్వరప్ప, విశ్రాంత గ్రంథాలయ అధికారి శ్రీ నీరుగంటి వెంకటేశ్వర్లు, స్థానిక గ్రంథాలయ అధికారి శ్రీ విజయ భాస్కర్, సభ సమన్వయకర్త శ్రీమతి మహాదేవి,శ్రీమతి నాగజ్యోతి,అడ్వకేట్ శ్రీ భాస్కరగౌడ్.. మొదలగు వారు పాల్గొన్నారు. అనతి కాల వ్యవధి లో 72 పుస్తకాలు వ్రాసి,ముద్రించిన సోమన్నను నాగలదిన్నె ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ. జాన్సన్ గారు,తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందించారు.
ఆలూరులో గద్వాల సోమన్న శాంతి కపోతం పుస్తకావిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి