న్యాయాలు -893
నిర్విమర్శాహి భీరవః న్యాయము
****
విమర్శ అనగా తీర్పు చెప్పే సామర్థ్యం.నిర్వమర్శ అనగా తప్పు లేకుండా, ఎలాంటి విమర్శలు చేయకుండా ,ప్రతి కూలత లేకుండా,విమర్శించని,ప్రతిబింబించని.ఆహి అనగా ఆత్మ. భీరవః అనగా భయపడటం,భయపడే వాడు అనే అర్థాలు ఉన్నాయి.
విమర్శ అనేది వ్రాత పూర్వక లేదా మౌఖిక ప్రసంగాన్ని క్రమ శిక్షణతో,క్రమ బద్ధంగా అధ్యయనం చేసే పద్ధతి. నిర్విమర్ళ అనేది వాస్తు రహిత స్పృహ,అంగీకరించక పోవడం అనే అర్థాలు ఉన్నాయి.
భయపడే స్వభావము కలవారు తాము చేయబోయే దానిని గురించి ఆలోచించుకోలేరు.కథా సరిత్సాగరంలోని ఈ కథ ఓ భయస్తుడైన వ్యక్తికి సంబంధించినది. అదేమిటో చూద్దామా.
మౌన వ్రతుడైన సన్యాసి ఒకడు ఒక వ్యక్తి ఇంటికి భిక్షకు వెళతాడు. అక్కడ బహు సౌందర్యవతియైన ఓ కన్యను చూస్తాడు.ఆమె ఎవరో కాదు ఆ ఇంటి యజమాని అయిన వ్యక్తి కూతురు. ఆమెను చూసి మోహిస్తాడా సన్యాసి.ఆ మాట బయటికి వ్యక్తం చేయకుండా "ఆహా ఎంత కష్టము!'అని వెళ్ళిపోతాడు.
ఇంటి యజమాని ఆ మాట విని ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి"స్వామీ! తాము మౌన వ్రతమును వీడి "ఆహా! ఎంత కష్టము" అని ఎందుకన్నారో చెప్పమని వేడుకుంటాడు.అప్పుడు ఆ సన్యాసి నీ కూతురుకు పెండ్లి అయిన వెంటనే నీవూ,నీ కుటుంబమూ నశిస్తారని తెలిసి "ఆహా ఎంత కష్టము"అని అన్నాను ఇంతే "అంటాడు.
దాంతో ఇంటి యజమాని ఆ అమ్మాయి తండ్రి భయపడి గడగడా వణికిపోతూ "అయితే నన్నేం చేయమంటారో చెప్పండి "అని అడుగుతాడు.అప్పుడా సన్యాసి "ఆమెను ఒక పెట్టెలో పెట్టి గంగలో విడిచి పెట్ఠు" అని చెబుతాడు. ఆ సన్యాసి చెప్పినట్లుగానే ఆ ఇంటి యజమాని తన కూతురుని ఒక పెద్ద పెట్టెలో పెట్టి గంగలో నీటి వాలు పక్కన వదిలి వస్తాడు.
ఆ తర్వాత ఆ సన్యాసి వెళ్ళి ఆమెను ఆ పెట్టెలోంచి బయటికి తీసి పెళ్ళి చేసుకుంటాడు.
ఇక్కడ ఈ "నిర్వమర్శాహి భీరవః న్యాయము"లో ముఖ్యంగా రెండు కోణాలు ఉన్నాయి. పిరికితనం వల్ల మంచి చెడులు ఆలోచించే విచక్షణ కోల్పోతాము.ఇలా ఇతరులచే మోసగింపబడతాము.
కొంతమంది దుష్టత్వంతో ఇతరుల సొమ్మును కానీ,వస్తువులను కానీ తెలివిగా స్వాధీనము చేసుకోవడం చూస్తూ ఉంటాం.ఆ విధంగానే సన్యాసి తెలివిగా చక్కని చుక్కను వివాహం చేసుకుంటాడన్న మాట.
అలా బెదిరించడానికి, భయపెట్టడానికి కారణం ఎదుటి వ్యక్తి యొక్క అమాయకత్వం, పిరికితనం.ఇవి ఉన్న వ్యక్తులు. ఇతరులకు భయపడి వారు చెప్పినట్లు చేస్తూ ఉంటారు..
మరి ఈ న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే పిరికితనం లేదా భీరత్వం అనేది ఒక పెద్ద బలహీనత. కాబట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ దరికి చేరనీయ కూడదు.ఓక్కసారి చేర నిస్తే నీడలా వెంటాడుతూ మనల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తుంది.
*ఇదండీ! "నిర్విమర్శాహి భీరవః న్యాయము" లోని అంతరార్థము.. అది గ్రహించి భీరత్వం వీడి తెలివిగా విమర్శనా దృష్టిని అలవరుచుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి