హెచ్డిఎఫ్సి బ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి జాతీయస్థాయిలో నిర్వహించే క్విజ్ పోటీలో మండలంలోని ఆయుధకర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు సృష్టి, హారిక, రిషిక ప్రతిభ కనబరిచి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు.
హైదరాబాదులో శుక్రవారం నిర్వహించిన క్విజ్ పోటీలో ఈ ముగ్గురు విద్యార్థులు పాల్గొని ప్రశంసా పత్రాలు, విద్యా కిట్లు పొందారు. వీరిని శనివారం నాడు పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, గైడ్ ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు రజిత, రవీందర్, సంధ్య అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి