సంక్రాంతి లక్ష్మి:- పైడి రాజ్యలక్ష్మి
 పచ్చి పసుపు ముఖానికి పూసి
గుమ్మడి పూ పుప్పొడి అలంకారమద్ది
మిరపపండుని బొట్టుగా ధరించి
తెల్లని మంచు తెరని చీరగా కట్టి
బంతి,చామంతులను కొప్పున ధరించి
పుష్యమిలోని అందాలనన్నిటిని
సింగారించుకున్న సిరి ధాన్యలక్ష్మి
నట్టింట నడయాడి నగవుతో వీక్షింప
హేమంత వీధిలో… తెలిమబ్బు గొడుగుతో
భాగ్యాల కడలిలో కానుకలు కురిపించ
కదలి వస్తున్న సంక్రాంతి లక్ష్మికి
అందరము కలిసి అంజలి ఘటించి
ఆహ్వానిద్దాము ఆనంద పరవశమంది
లేలేత కిరణాల అరుణునితో రమ్మని

కామెంట్‌లు