సాహితీ కవి కళాపీఠం
సాహితీ కధలు
============
రాధిక, రామం భార్యా భర్తలు.
రామం వింజమూరు లో... హై స్కూల్ హెడ్ మాస్టర్. రాధిక, గృహిణి. వారికి శరత్, సంహిత ఇద్దరు కమల పిల్లలు. శరత్ చిన్నప్పటినుండి "ఆవరేజ్ స్టూడెంట్..". సంహిత ఎప్పుడు క్లాసు లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యేది.
మొగపిల్లవాడికి చదువు మీద శ్రద్ధ లేకపోతే ఎలా పైకి వస్తాడు. వీడి జీవితం ఎలా! అని ఎప్పుడూ దిగులు పడేవాడు రామం. రామం తో పాటే రాజశేఖరం కి కూడా ఉద్యోగం వచ్చింది. ఆయన డ్రిల్లు మాస్టర్. ఇద్దరు ఒకే స్కూల్ లో పనిచేసే వారు పైగా..మంచి స్నేహితులు. వారిద్దరికి ఇంకో స్నేహితుడు కోటేశ్వరరావు, అతను డబ్బున్నవాడు కావటం తో సొంత కోర్పొరేట్ కాలేజీలు పెట్టాడు పట్నం లో.... జల్సా పురుషుడు.
రామం, రాజశేఖరం ఇద్దరు
ఎప్పుడూ, అరమరికలు లేకుండా కష్టసుఖాలు మాట్లాడు కునే వారు. రాజశేఖరం కు ఒక్కగానొక్క కొడుకు కృష్ణతేజ.. ఈ
ముగ్గురు పిల్లలు వారి స్కూల్ లోనే చదివే వారు. కృష్ణతేజ కి ఫస్ట్ వస్తే, సంహిత కి సెకండ్ రాంకు...
సంహితకి ఫస్ట్ వస్తే కృష్ణతేజకి..
సెకండ్ రాంక్ అలా పోటీలు పడి చదివే వారు.
శరత్ లోని టాలెంట్ గమనించి ఆటల్లో చురుకుతనం చూసి,
డ్రిల్లు మాస్టర్ రాజశేఖరం కోచ్ అవటం తో వాలీబాల్ ఆడటం నేర్పాడు. ఎప్పుడూ... ఆటలేనా
చదువు మీద శ్రద్ధ చూపించు అని రామం కోప్పడుతుంటే, ఊరుకోరా రామం, పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో కూడా శిక్షణ ఇవ్వాలి. నీకొడుకు మంచి చాంపియన్ అవుతాడు చూడు అంటూ... సమర్థించేవాడు శేఖరం మాస్టారు.
స్పోర్ట్స్, సంగీతం, డాన్స్, యోగా
వీటిల్లో కూడా శిక్షణ ని ఇప్పించే వారు రామం మాస్టారు,స్కూల్ లోని పిల్లలకు. రాధిక మంచి సంగీతం టీచర్ కావటం తో ఒక గంట రోజూ పిల్లలకు ఫ్రీగా సంగీతం నేర్పించేది. శేఖరం చెల్లెలు వనజ కాలేజీలో బి. ఎస్. సి.... చదివేది, తనకు వచ్చిన కూచిపూడి నృత్యం పిల్లలకు
ఖాళీ టైం లో నేర్పేది.
పిల్లలు టెన్త్ క్లాస్ కి వచ్చారు, ఇద్దరికీ స్టేట్ రాంకు రావటం తో
ఇంటర్ లో కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఎగపడి పోటీ పడి చేర్చుకున్నారు సంహిత, కృష్ణతేజ
ఇద్దరిని... "శరత్ ఎలాగో ఏ గ్రేడ్ తెచ్చుకున్నాడు ముక్కి మూలిగి...". ముగ్గురిని పట్నంలో
హాస్టల్ తిండి పడదని రూమ్ తీసుకుని, వండి పెట్టే బాధ్యత రాధిక తీసుకుంది. సంహిత, కృష్ణ తేజ చిన్నప్పుడు తమకు స్కూల్ లో చదివేటప్పుడు స్కూల్... ఆనివెర్సరీ కి బహుమతి ప్రధానం చేసిన కలెక్టర్ గారి మాటలు గుర్తుండిపోయి... అదే స్ఫూర్తి తో
చదివి మంచి రాంకులతో, "సంహిత ఐ. ఏ. ఎస్... కు", "కృష్ణ తేజ... ఐ. పి. ఎస్. కు సెలెక్ట్ అయ్యారు. శరత్ వాలీ బాల్ నేషనల్ ఛాంపియన్ అయ్యి రైల్వే డిపార్ట్మెంట్ లో సౌత్ సెంట్రల్ రైల్వే లో పెద్ద ఆఫీసర్ అయ్యాడు.
సంహితకి, కృష్ణ తేజ కి మంచి మెరిట్ రావటం తో ఇద్దరికీ కోరుకున్నట్లు వాళ్ళ డిస్ట్రిక్ట్ లోనే పోస్టింగ్ ఇచ్చారు.
రామం వాళ్ళ పల్లె లోని రైతు నాగన్న ఎంతో కష్టపడి పగలు రాత్రి కాయ కష్టం చేసి పిల్లలను టెన్త్ వరకు ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ లో చదివించాడు. ఈ సంవత్సరమే ఇంటర్ లో గేదెలను అమ్మి వచ్చిన డబ్బుతో కోటేశ్వరరావు కార్పొరేట్ కాలేజీ లో.. చేర్పించాడు కూతురు సరితను. పుస్తకాలు చదువుకు రామం మాస్టారు సహాయం చేసేవాడు.
ఒకరోజు సరిత హాస్టల్ నుండి ఫోన్ చేసి నాన్న నేను ఇక్కడ ఉండలేను నాన్న... ఇంటికి వచ్చేస్తాను, అని ఏడవటం తో నాగన్న కు ఏమి అర్ధం కాలేదు, వెళ్ళి జ్వరం తో బాధపడుతున్న
కూతురు ని చూసి తీసుకువచ్చి వైద్యం చేయించి మళ్ళీ తగ్గాక, తీసుకుని వెళ్ళి హాస్టల్ లో వదిలి పెట్టాడు." ఎంతో దిగులుతో ఉంది సరిత..." ఇంటిమీద బెంగ ఏమో! అనుకున్నాడు నాగన్న.
సరిత యోగ క్షేమాలు కనుక్కునేది సంహిత అప్పుడప్పుడు. ఒకే ఊరువారు కావటం తో అక్కా! అని ఎంతో ప్రేమగా ఉండేది సరిత.
సరిత కాలేజీ ప్రిన్సిపాల్ నుండి మీ అమ్మాయికి సీరియస్ గా... వుంది వెంటనే రండి అని ఫోన్ రావటం తో లబో దిబో మంటూ
రామం మాస్టారు ని తీసుకుని
కాలేజీ కి వచ్చాడు నాగన్న, మా అమ్మాయి సరితకి ఏమైంది? ఎక్కడ సరిత? అని అడుగుతున్న తండ్రితో లెక్చరర్స్ గానీ, ప్రిన్సిపాల్ గానీ, వార్డెన్ కానీ సమాధానం చెప్పట్లేదు సరీగా,పైగా పొంతన లేని సమాధానాలు చెపుతున్నారు..
కంగారు ఎక్కువైంది నాగన్న కి, రామానికి, ఉండు నాగన్న.... అమ్మాయికి ఫోన్ చేస్తాను, అని ధైర్యం చెప్పి, సంహితకు ఫోన్ చేసి
విషయం అంతా చెప్పటం తో, మీరు కంగారు పడకండి నాన్న నేను కనుక్కుంటాను అని సంహిత, పి. ఏ. ని పిలిచి విషయం కనుక్కోమంది వెంటనే, ఒక పావు గంటకి పి. ఏ. మేడం గారు సంగతి అంతా అయోమయం గా ఉంది అండీ,...
మీరు పర్సనల్ గా వెళ్తే కానీ! అని నీళ్ళు నమలటంతో సరే పదండి అని, హుటాహుటిన కాలేజీ కి వచ్చింది సంహిత, మాములుగా సింపుల్ గా ఉన్న సంహితకి, అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కలెక్టర్ అని తెలియక ఇష్టం వచ్చినట్లు, సమాధానం చెప్పిన వార్డెన్ వర్కర్స్, ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అందరిని ఒక్కసారి చూసి బయట నిలబడ్డ ఆఫీసర్స్ ని లోపలికి రమ్మని పిలిచింది, మరియు కృష్ణ తేజ ఎస్. పి. కి ఫోన్ చేసి పిలిపించింది వెంటనే.
సంహిత కొత్త కలెక్టర్ అని తెలియటం తో బిర్ర బిగుసుకుపోయారు అక్కడి వారు అందరూ...
సరిత రూమ్ లోకి వెళ్ళి చూడగానే ఫ్యాను కు చున్నీ వేలాడుతూ కనిపించింది. అక్కడ అక్కడ రక్తపు మరకలు, అనుమానం తో అక్కడ స్టూడెంట్స్ అందరిని ప్రశ్నించింది, విరిగి పోయిన బెంచీలు, నీళ్ళు రాని దుర్గంధం తో ఉన్న తలుపులు లేని బాత్రూములు, వర్షం పడి స్లాబు కారి రూమ్స్ లో పడ్డ నీటి మడుగులు,ఎన్నాళ్ళోఅయినట్లు ఉంది గదులు శుభ్రం చెయ్యక, విరిగిపోయి పనికి రాని మంచాలు, పరుపులు,తలుపులు లేని కిటికీలు, బొద్దింకలు, ఎలకలు, నల్లులు రాజ్యం ఏలే గదులు, అపరిశుభ్రం గా ఉన్న వంట గదులు, పాచిపోయిన ఆహార పదార్ధాలు అన్నీ చూసారు కలెక్టర్ బృందం,
అక్కడ ఉన్న ఎవ్వరిని బయటకు వెళ్లకుండా, వాళ్ళ ఫోన్లు అన్నీ తీసుకుంది, మీడియా కు కబురుచేసి పిలిపించింది ముందే
అన్నీ వీడియో కవరేజ్ చేసి రూమ్ సీజ్ చెయ్యమంది. తోటి పిల్లలు చెప్పిన సమాచారం బట్టి హత్యను ఆత్మ హత్య గా చిత్రీకరించి ఊరేసుకుంది అని మేనేజ్మెంట్..
తప్పుకోవాలని చూస్తున్న విషయం చూచాయగా అర్ధం అయ్యింది, సంహితకు. ఎస్. పి. కృష్ణతేజ కు
అందరినీ కష్టడీలోకి తీసుకోమని ఆదేశించి పిల్లలు అందరిని ఒక్కొక్కరిని ప్రశ్నించి వివరాలు రాబట్టింది. హాస్పిటల్ కి వెళ్ళి చూసి సరిత బాడీ ని పోస్ట్ మార్టం
చెయ్యటానికి ఆదేశాలు ఇచ్చింది. నాగన్న దంపతుల బాధ ఇంతా అంతా కాదు. వారిని ఓదార్చి తండ్రిని చూసుకో మంది, పేపర్లు, టీవిల నిండా ఇదే సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. కార్పొరేట్ కాలేజీ ల బాధ్యతా రాహిత్యం పిల్లల ప్రాణాలను బలిగొంటోంది అని పేరెంట్స్ అందరూ ధ్వజమె త్తారు. అందరూ హైకోర్టుకు వెళ్లారు,సరిత ఆఖరి వాంగ్ మూలం గా అక్క సంహితకు అన్నీ వివరాలు స్వ దస్తూరీ తో రాసి పోస్ట్ చేసిన ఉత్తరం సంహితకు, కేసుకు బలమైన సాక్ష్యం గామారింది. మేనేజ్మెంట్ మీద కేసు వేశారు. ఈ కేసు హియరింగ్ కి వచ్చింది.
కోర్టు వారు అడిగిన ప్రశ్నలు?
ఈ కేసు పూర్వా పరాలు విచారించాగా!
1) పిల్లలు చదవగలరో లేదో వారి సామర్ధ్యం ఎంతో తెలుసుకోకుండా
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఒకరి మీద ఒకరు పోటీతో, అప్పులు చేసి మరీ ఆస్తులు అమ్మి మొయలేని బరువు పిల్లల నెత్తినబెట్టి వారికి మంచి చేస్తున్నాము అనే సాకుతో వారి
ఆలోచన, ఆశ, ఇష్టం ఏంటో తెలుసుకోకుండా, మన ఇష్టాలు వారిపై రుద్ది, వారు అటు ఇటు చెప్పలేక, మార్కులు ఎక్కువ రాలేదని మానసిక వేదనకు గురిచేసి, అన్నీ ఇచ్చాం మాతప్పు ఏమీ లేదు అని, అక్కడ సౌకర్యాలు ఏమున్నాయో, వారు పిల్లలని ఎలా చూస్తున్నారో కూడా పట్టించుకోకుండా, మా పని అయిపోయింది అని చేతులు దులుపుకునే తల్లితండ్రులదా ?
2) నా శక్తి ఇంతే నేను ఇంతవరకే చదవగలను, నాకిది ఇష్టం, ఇష్టం లేదు, అని తల్లి తండ్రులకు చెప్పలేని నిస్సహాయత లో ఉండి, హాస్టల్ లో, కాలేజీలో ఎవరికి సమాధానం చెప్పలేక, పరిస్థితులకు ఇమడలేక రాజీ పడలేక, బలవన్మరణం పాలయి తనువు చాలించి తల్లి తండ్రులకు కడుపుశోకం మిగిల్చే పిల్లలదా ?
3) డబ్బు దాహం తో సరస్వతీ దేవిని అంగడి సరుకుగా అమ్ముతూ లక్షలు, కోట్లు గడిస్తూ
సగటు తల్లి తండ్రుల రక్త మాంసాలని పిండుకుంటూ, పిల్లలని జంతువులు కన్నా హీనంగా చూస్తూ అడిగేవాడు లేడని, ధన దాహంతో రాంకుల చీకటి వ్యాపారం చేసి నేరాలు, ఘోరాలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలదా?
4) ఇదేమిటని ప్రశ్నిస్తే ఓట్లు పోతాయేమో మన వాటా మనకి వస్తుందిగా,అని ఊరకుండే రాజకీయ నాయకులదా?
5) అన్యాయం ని ఇదేమిటని ప్రశ్నించి? న్యాయానికి న్యాయం చెయ్యటానికి గొంతెత్తి చెప్పలేని, రేటింగ్ తప్ప, తప్పు ని తప్పని ప్రశ్నించలేని, కుహనా లౌకిక వాదులదా? అడ్వర్టయిస్మెంట్స్ తప్ప వేరే లేని,వ్యాపారం
ప్రజాస్వామ్యం లో మీడియా పత్రికలదా ?
6) ఇవన్నీ చూస్తూ మేము ఇంతే మేము మారం, కష్టం నాకు కాదుగా పక్క వాడికి వచ్చింది,నేను నా వాళ్ళు బానే ఉన్నాము కదా, అని అన్నీ నవ రంధ్రాలు మూసుకుని కూచుని అప్పుడు వరకే అయ్యో అని, నాకెందుకులే అని గొర్రెలు గా తలవంచుకుని పోయే సమాజానిదా?
తీర్పు మీరే చెప్పండి. ఏది ఏమైనా ఒక చిన్ని ప్రాణం మొగ్గ లోనే వాడి
పోయింది.
మీ కుతంత్రాలు, అన్యాయాలు బయట పెడతాను అన్న సరిత ను మానసికంగా, శారీరకoగా హింసించి, ప్రాణం తీసి చున్నీ తో ఫానుకు వేలాడదీసి,
హత్య ను ఆత్మ హత్యగా చిత్రీకరించిన కళాశాల యాజమాన్యం, అందులో నిందితులకు ఉరిశిక్ష వేస్తూ హానరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసు మొత్తం పది సంవత్సరాలు పట్టింది, అప్పటికి కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఆ తల్లి తండ్రులకు చెప్పులు ఎన్నో జతలు అరిగి పోయాయి. ముసలి వారయి వయసు భారం తో పాటు లాయర్ ల ఫీజులకు ఆస్తులు కూడా అమ్ముకో వలసి వచ్చింది.
నీతి :-...."ఆశలు ఉండటం మంచిదే కానీ, సాధ్యా సాధ్యాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఒకరైన ఇద్దరైనా కంటికి రెప్పలా కాచుకో గలిగినప్పుడే పిల్లలను కనాలి,
పులిని చూసి నక్క వాత పెట్టుకో
కూడదు. ఏ పరిస్థితులు వచ్చినా బ్రతికే ధైర్యం పిల్లలకు నేర్పాలి.
సర్టిఫికెట్ లు కూడు పెట్టవు, సమయ స్ఫూర్తి కావాలి. పిల్లల మీద మనం చెయ్యాలి అనుకుని చెయ్యలేక పోయిన కోరికలు తీర్చుకోవాలి అనుకోవటం శ్రేయస్కరం కాదు."
ఆడంబరాలు:- సి. హెచ్. అనసూయ-హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి