కంచి పరమాచార్య ఓసారి చెప్పిన రామనామ మహిమ ఇది.
ఓ భజన గోష్టి వీధిలో నామసంకీర్తనం చేసుకుంటూ పోతోంది. దీనిని నిర్లక్ష్యం చేసిన ఓ వ్యక్తికి రామనామాన్ని ఉపదేశించిన జ్ఞాని ఒకరు దీనిని ఒకేఒక్కమారు నిండు హృదయంతో చెప్పి చూడు. అంతేకాదు, దానిని అమ్ముకోకు అని అన్నారు.
అతను అలాగేనని చెప్పాడు.
కాలక్రమంలో అతను అస్తమించాడు. అతని ఆత్మను తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలిపారు. యమధర్మరాజు అతని పాపపుణ్యాలను లెక్క కట్టి ఒకేఒక్కసారి రామనామాన్ని చెప్పావు. నీకేం కావాలో చెప్పు అని అడిగాడు.
రామనామాన్ని ఉపదేశించిన జ్ఞాని రామానామాన్ని అమ్ముకోకు అని చెప్పిన మాట గుర్తుకొచ్చి రామానామానికి మీరు ఏం ఇవ్వదలచుకున్నారో మీరే ఇవ్వండి...నేనంటూ ఏదీ అడగను అన్నాడతను.
విస్తుపోయిన యమధర్మరాజు రామానామాన్ని నేనెలా వెలకట్టగలను....అని అనుకుని దీనిని ఇంద్రుడే తీర్మానించాలన్నాడు. నాతో రా ఇంద్రుడి వద్దకు పోదాం అన్నాడు యమధర్మరాజు.
అయితే అప్పుడతను తాను పల్లకీలో వస్తానని, పల్లకీ మోసే వారిలో మీరు ఒకరై ఉండాలి, ఇది తమరికి సమ్మతమేనా అని అడిగాడతను.
అయితే యమధర్మరాజు తననే పల్లకీ మోయమన్నాడంటే రామ నామం ఎంతో మహత్తయినదై ఉండొచ్చు....కనుకే ఇలా మాట్లాడుతున్నాడనుకున్నాడు మనసులో.
అంతేకాదు, పల్లకీ మోయడానికి కూడా సమ్మతించాడు.
అతనిని పల్లకీలో కూర్చోమని చెప్పి మోసి ఇంద్రుడి వద్దకు తీసుకుపోయాడు యమధర్మరాజు.
తీరా ఇంద్రుడి వద్దకు వెళ్శేసరికి అబ్బో రామనామ మహిమను తాను ఇంత అని ఎలా చెప్పగలను...బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అడగండి అన్నాడు ఇంద్రుడు.
అప్పుడు అతను యమధర్మరాజుతోపాటు ఇంద్రుడు కూడా పల్లకీ మోస్తేనే తాను బ్రహ్మ దగ్గరకు వస్తానన్నాడు. యమధర్మరాజులాగే ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించాడు. బ్రహ్మదగ్గరకు వెళ్లారు. అయితే బ్రహ్మ కూడా తాను రామనామమహిమ ఇంతని అని తాను చెప్పలేను కనుక వైకుంఠానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తినే అడగండి అన్నాడు. అతను కూడా యమధర్మరాజు, ఇంద్రుడితో కలిసి బ్రహ్మ కూడా పల్లకీని మోయవలసి వచ్చింది. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్లారు. అందరూ ముక్తకంఠంతో విష్ణువుతో చెప్పారు.
ఈ పల్లకీలోని ఆత్మ ఒకేఒక్కసారి రామనామాన్ని చెప్పింది. కనుక అతనికి లభించిన పుణ్యమేంటో చెప్పండని అడిగారు.
అప్పుడు విష్ణుమూర్తి ఈ జీవిని మీరందరూ కలిసి పల్లకీలో మోసుకురావడం బట్టే రామనామ మహిమను గ్రహించలేకపోయారా.....అంటూ పల్లకీలోని ఆత్మను తనలో ఐక్యం చేసుకున్నారు.
భగవంతుడి నామాన్ని భక్తిశ్రద్ధలతో చెప్దాం....పరమాత్మ కృపతో కష్టాలను అధిగమిద్దాం....
రోజూ ఉదయం నారాయణ నామాన్ని, రాత్రి నిద్రపోయేటప్పుడు శివనామాన్ని చెప్దాం....అని కంచిపరమాచార్య చెప్పారు.
ఈ రెండు నామాలు ఓ దివ్యమంత్రాలే.
-

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి