సాహితీ కవి కళా పీఠం
సాహితి కథలు
================
"లక్షల్లో ఫీజులు పోసి చదివించే స్తోమతు లేదు మనకు..ఏదైనా మామూలు స్కూల్లో చేర్పిద్దాం భారతీ..!" అన్నాడు మోహన్.
"నిజమే కానీ... అందరూ ఎలా చేస్తున్నారో కానీ..ఆ కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించి పిల్లలని చదివిస్తున్నారు.." అంది భారతి.
"ఎలా చేస్తారేమిటి...అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు..ఇప్పటికిప్పుడు ఇంజనీర్లై కోట్లు గడించాలని తల్లితండ్రుల ఆశ..ఇలా ఉంది ప్రపంచం..
వీళ్ళ ఆలోచనలు, ఆశలను బట్టే ఆ స్కూలు ఫీజులు వసూలు చేస్తున్నారు లక్షలు లక్షలు.." అన్నాడు చిరాగ్గా మోహన్..
"ఇదిగో చెప్తున్నా..భారతీ!నేను మాత్రం నా పిల్లలు ఇద్దర్నీ ప్రభుత్వ స్కూల్లో చేరుస్తాను..చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు.." అన్నాడు మొండిగా మోహన్.
"అయ్యో రామా..అవేం మాటలండి..ఎలాగోలా సర్దుకుందాం..పిల్లల్ని ఆ కార్పొరేట్ స్కూల్లో చేరుద్దాం.." అంది చేతికున్న నాలుగు గాజులు తీస్తూ..
"అక్కరలేదు..నేను ఒక్కసారి చెప్పానంటే ఇక వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి స్టాఫ్ ఉంటారు. పాఠాలు బాగా చెప్తారు.
అందుకే నా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేరుస్తా " అన్నాడు స్తిరంగా మోహన్.
అనుకున్నదే తడవుగా పిల్లలు ఇద్దర్నీ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాడు మోహన్..
అక్కడ ఆడుతూ పాడుతూ చక్కగా ఎదుగుతూ,చదువుకున్నారు అరుణ్, తరుణ్.
చదువులోనే కాదు ఆటపాటల్లోనూ స్టేట్లో మొదటి ర్యాంకుల్లో నిలిచారు పిల్లలిద్దరూ..
ఆరోగ్యానికి ఆరోగ్యం, చదువుకు చదువు పిల్లలిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఎంతో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది.
పదవతరగతిలో ఇద్దరూ స్టేట్ ఫస్ట్ వచ్చారు. వాళ్ళ మార్కులకు ఫ్రీగా ఇంటర్ సీటు ఇచ్చాయి కొన్ని కాలేజీలు .
అందులో బెస్ట్ వి సెలెక్ట్ చేసుకుని చేరిపోయారు అరుణ్,తరుణ్.
ఒకరు డాక్టరు, మరొకరు ఇంజనీరు..
మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు..
అమ్మా నాన్నలకు ఆసరాగా ఉన్న ఊళ్ళోనే హాయిగా జీవించసాగారు ఆ కుటుంబం..
ప్రభుత్వ పాఠశాలలే ముద్దు..!!:- డా.మరుదాడు అహల్యా దేవి (మిత్రవింద)బెంగుళూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి