సుప్రభాత కవిత : - బృంద
మనసు అనుభూతులు 
అల్లుకునే పందిరి 

సంతోషం కలిగితే 
అంబరమంత సంబరం
 
శోకం ఆవరిస్తే చీకటి నిండిన 
ఒంటరితనపు  అనుభవం 

గాయపడితే ముల్లులా గుచ్చే
నిరంతర జ్ఞాపకం

అనుకోని ఆపదలపాలైతే 
అలవి కాని విషాదం

మనకు మనం చెప్పుకునే 
ధైర్యం ఒక ఓదార్పు

సమయం రావాలని 
సర్దిచెప్పే సహనం  ఒక బలం

చుట్టూ జరిగే విషయాలకు 
స్పందించడం మనిషి అనిపించే లక్షణం

పరులు తానే యన్న భావన 
కలిగి కురిసే కన్నీరు అపురూపం

విజయాలకు పొంగిపోవడం
విలయాలకు తల్లడిల్లడం
మనసులో  చెమ్మ వున్న మనిషికి 

తప్పించుకోలేని అనుభవం

ప్రతి రాత్రికి ఒక పగలున్నట్టు
ప్రతి సమస్యకి ఒక పరిష్కారం 
ఉంటుంది

ప్రతి  ముగింపు ఒక ఆరంభం 
అంటూ ఆశావహంగా వస్తున్న
ఉదయానికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు