సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
============
ది భిక్షువు వాడు, కపాలమేబిక్షపాత్ర.
బూడిద పూసుకునే వాడు, కాష్టం లో బూడిదే వాడికి అలంకారం.
బుసలుకొట్టే నాగులే, పూలమాలలు, మణి భూషణాలు.
పులిచర్మమే, పట్టు పీతాంబరము.
జడలు కట్టిన జంగమ దేవర.
పైగా! నెత్తిన ఒకామె గంగమ్మ.
పక్కన ఒకామె పార్వతమ్మ, ఇద్దరు సవతుల పోరు మా అయ్యకి.
ఇల్లే వాడికి స్మశానం
భూతాలే అనుచరులు
వాడే మా అయ్య శివయ్య
అమ్మ,నాన్న, లేనివాడు.ఇల్లు వాకిలీ,లేనివాడు.
పాపం! వాడికి దిక్కెవరు, దిక్కులన్నీ నావే అంటాడు.
అందరికి తానే దిక్కంటాడు.
నమ్మిన వాడికి,వెంటే తిరుగుతాడు.
నీకన్న మాకెవరు దిక్కంటే పొంగిపోతాడు, పిచ్చి మారాజు.
హాలాహలాన్ని మింగి కంఠం లో దాచుకున్నాడు,
గరళ కంఠుడు వాడు నీలకంఠుడు అయినాడు.
మా అమ్మ దొడ్డ ఇల్లాలు.
వెర్రి బాగుల తల్లి,అమ్మంటే అమ్మే
పట్టు పీతాంబరములు వద్దని
నారాచీరలు కట్టింది, కొండల్లో కొనల్లోనివాసం.
ఆకులు అలములు పరమాన్నాలు,
ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది.
సర్వమంగళ మాయమ్మ,తన మంగళ సూత్రం మీద
నమ్మకంతో పిల్లల ని, లోకాలని రక్షించాటానికి
విషాన్ని మింగేయమంది.మా అయ్యని.
"ఇదెక్కడి సోద్యమో! వింటిమా కంటిమా ఎప్పుడైనా ఎక్కడైనా."
నంది వాహనుడు, నాగ భూషణుడు, వేడికి తట్టుకోలేక,
మంచు పర్వతాల్లో ఉన్నాడు. నెత్తిన శశిని పెట్టుకుని చంద్ర శేఖరుడు అయ్యాడు
. "ఒక్క బిల్వ దళం ఇస్తే కోట్ల సంపాదలిచ్చే
అల్పసంతోషి. "మా అయ్య.శివ శివా!
అని చెంబెడు నీళ్ళు, భక్తితో పోస్తే, మోక్షాన్నే ఇస్తాడు.
"హర హర మహాదేవ శంభో శంకర".
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం మహానుభావా!
నా మనస్సు,అనే పుష్పాన్ని, నీ పాదాల చెంత ఉంచి: మనసా, వాచా, కర్మణా,
నీవే దిక్కని,శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
శంకరా అభయంకరా,ఓం నమః శివాయ.
పునరావృత్తి రహిత,శివ సాయుజ్యాన్ని ప్రసాదించు స్వామీ 🙏💐
జగములనేలే జంగమయ్య :- సి. హెచ్. అనసూయ-హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి