తేలిక!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మనం 
ఎగిరిపోవడం కన్నా 
చనిపోవడం 
చాలా తేలిక!!


మనం 
బ్రతకడం కన్నా 
మనల్ని మనం 
మర్చిపోవడం 
చాలా తేలిక!!!

మనం 
పోటీ పడకపోవడం కన్నా 
సహనంగా ఉండడం 
చాలా తేలిక!!

మనం 
పోల్చుకోకుండా ఉండడం కన్నా 
సన్యాసిగా ఉండడం 
చాలా తేలిక!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
బాగుంది