కాలచక్రం :- ఎడ్ల లక్ష్మి
సూర్యచంద్రుల తేడే ఏంటి 
రేయి పగలు మార్పేంటి 
ఉదయం వేళ సూర్యోదయం
సంధ్యా వేళ చంద్రోదయం

సుప్రభాత వేళ లేత కిరణాలతో 
ఉదయభాను డొస్తాడు 
అవని తల్లి పాపటలో 
మెరిసే బిల్లగా నిలుస్తాడు 

సంధ్య కాల సమయములో 
బండి చక్రముల చంద్రుడు 
సింధూరపు రంగులో 
భూతల్లి నుదట తిలకమై వస్తాడు 

రేయి పగలు గడిస్తే 
ఒక దినమై నిలుస్తుంది 
నాలుగువారములు గడిస్తే 
ఒక మాసమని తెలుస్తుంది 

పౌర్ణమి అమావాస్యలతో 
తిథులు నక్షత్రాలతో 
జాతక చక్రం గిరగిర తిరుగుతూ 
కాలచక్రాన్ని చూపుతుంది


కామెంట్‌లు