కొత్తూరు రచయితల వేదిక ఆధ్వర్యంలో, కొత్తూరు కవనం అను సంకలనం విడుదలచేసామని వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు తెలిపారు. స్థానిక విజ్ఞాన భారతి విద్యాలయం ఆవరణలో నిర్వహించిన కొత్తూరు రచయితల వేదిక మూడవ నెల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు కవనం అను సంకలనాన్ని తిరుమలరావు ఆవిష్కరించారు. సామాజిక బాధ్యతను గుర్తెరిగి సాహిత్యవేత్తలంతా రచనలు చేస్తారని, తద్వారా ప్రజలను చైతన్యపరుస్తారని ఆయన అన్నారు. పుస్తక రూపకల్పనకు దోహదపడిన పారిశెల్లి రామరాజు, ఆర్.నరసింహప్పడు, ఎ.వి.ఆర్.ఎం. దిలీప్ రాజా పట్నాయక్ లకు కొత్తూరు రచయితల వేదిక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం కొత్తూరు కవనం తొలి పుస్తకాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన రౌతు నరసింహప్పడుకు అందజేసారు. నరసింహప్పడు మాట్లాడుతూ ఈ కొత్తూరు కవనం సంకలనంలో కుదమ తిరుమలరావు, అమ్మల కామేశ్వరి, ముదిల శంకరరావు, కలమట శ్రీరాములు, ఎ.వి.ఆర్.ఎం. దిలీప్ రాజా పట్నాయక్, వై.అప్పలనాయుడు, గడసాపు ఉషారాణి, పల్ల నారాయణరావు, గేదెల మన్మధరావు, పెదకోట ధనుంజయరావు, కె.గోవిందరావు, బూరాడ గణేశ్వరరావు, బి.సంతోష్ కుమార్, యు.ప్రసాదరావు, జి.శార్వాణిల ముప్పది కవితలు ప్రచురితమైనాయని, ఈ పదిహేను మంది రచయితలను అభినందిస్తున్నానని అన్నారు. కొత్తూరు కవనం సంకలనాన్ని రూపొందించడం ఒక మంచి శుభ పరిణామమమని, ఈ సంకల్పం, ఆచరణ గావించిన కొరవే ఆలోచన మిక్కిలి ప్రశంసనీయమని ఆయన అన్నారు. సాహిత్యం రాయడానికి మరి కొంతమంది ముందుకు రావాలని, సాహిత్యాన్ని విద్యావంతులంతా చదవాలని నరసింహప్పడు పిలుపునిచ్చారు.
సభాధ్యక్షులు కుదమ తిరుమలరావు సమన్వయంతో కవిసమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో
కుదమ తిరుమలరావు, అమ్మల కామేశ్వరి, కలమట శ్రీరాములు, ముదిల శంకరరావు,
గడసాపు ఉషారాణి, పల్ల నారాయణరావు,
పెదకోట ధనుంజయరావు, గేదెల మన్మధరావు, బూరాడ గణేశ్వరరావు తమ కవితలు వినిపించారు. కవులందరినీ ముఖ్య అతిథి, స్వచ్ఛ జీవనం పుస్తక రచయిత ఆర్.నరసింహప్పడు శాలువాలు, సంకలనాలతో ఘనంగా సన్మానించారు. అతిథిగా విచ్చేసి వారి అమూల్యమైన సందేశం అందించిన రౌతు నరసింహప్పడును వేదిక ఘనంగా సన్మానించింది. గౌరవ అతిథులుగా విచ్చేసిన విశ్రాంత మండల విద్యాశాఖాధికారి బొడ్డేపల్లి శ్రీనివాసరావు, తెలుగు భాషా పండితులు వైశ్యరాజు హరనాథరాజు, విద్యావంతులు జి.తిరుపతిరావులను వేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతిభా పోటీల్లో విజేతగా నిలిచిన చిన్నారి బరాటం కీర్తనకు బహుమతిని అందజేసారు. ఎల్.జయరాం, పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి