తోడు:- జంజం కోదండ రామయ్య జమ్మిపాళెం
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరడాలు
==============
చెట్టు మిత్రమా!
మా బ్రతుకు నీ చేతిలో వుంది
చల్లని ఛాయనిస్తావు
మంచి గాలినిస్తావు
కమ్మని ఫలాలనిస్తావు
ఎంతని చెప్పను నువు చేసే మేలు
నువు లేనిదే లేనే లేదు జగతి...!!

నిన్ను చేస్తున్నాము నిర్లక్ష్యం
డబ్బుకాశపడి
నిన్ను అమ్ముకుంటున్నాము...!!

వాడు కొట్టుకు పోతే
ఎండకు మండి పోతున్నాము
జబ్బులతో పండి పోతున్నాము..!!

మేము పోతే పాడియై మోస్తావు
నీ కట్టెలు మాకు తోడుగా వుండి
అగ్నికి ఆహుతౌతాయి...!!

జీవితాంతం ఉంటావు మాకు తోడు
అయినా నీకు చేస్తున్నాము కీడు...!!!


కామెంట్‌లు