పిల్లలూ... ఇన్నిరోజులూ
ఆడిన ఆటలు చాలు....!
రా రమ్మని పిలిచింది బడి...!!
మూల పడేసిన బ్యాగ్ లు దులుపుకుని....
లంచ్ బాక్స్ లను సర్దుకుని,
వాటర్ బాటిల్ పెట్టుకుని
పై క్లాస్ ల ఉత్సాహపు ఊహలతో...
బిర బిరా బయలుదేరబోవు పిల్లలకు ..
ఆదిలోనే హంస పాదులా
అడ్డొచ్చింది వాన....!
అనుకుంటే...,
చల్లదనాన్నిచ్చిన వాన చల్లగాజారుకుని పిల్లలను
బడులకు పంపింది ఆశీర్వ దీస్తూ.....!
గణ గణ గణ మని మ్రోగింది బడి గంట
వంత పలికింది గుడి గంట !
పిల్లలూ.....
మీరు చక్కగ చదువులు చదవాలి
గొప్పవారిగా ఎదగాలి...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి