:"అశాంతి సంహారం":- బెహరా నాగభూషణరావు.
సాహితీ కవి కళా పీఠం.
సాహితీ కెరటాలు 
=============
ఎరుపెక్కిన ఎర్రని సూరీడులా,

కణకణ మండుతున్న ఎర్రని చింత నిప్పుల్లా ,

ఎగిసిపడే లావాలా, 

"నా రక్తం" మండుతోంది.
 

అందనంత ఎత్తులో; అరాచకత్వాలు. 

ఆకాశాన్ని అందుకోవాలనే;అమానవీయాలు.

ఎవరెస్ట్ ను చేరాలనే; దుర్మార్గాలు.

మేఘాలను ముట్టుకోవాలనే; అన్యాయాలు.

నాకళ్ళను, ఎరుపెక్కిస్తున్నాయి.


మద మత్తులో- విలాసవంతులు,

స్వార్థమత్తులో- నాయకులు,

పట్టిన బూజులో- వ్యవస్థలు,

తప్పిన గతిలో- మానవత్వాలు,

నా హృదయానికి తాకే బాణాలవి.


నా నినాదం ఒక్కటే 
"అశాంతి సంహారం"

నా లక్ష్య సాధనకు,

చూపుల్లో- హావం.
హవంలో- రౌద్రం.
 రౌద్రంలో -భావం. 
ఎగిసే జువ్వల్లా , ప్రతిబంబిస్తా.

ఎత్తే చేతులు  "పిడికిలిలై"
ఉరగాంగణ లా
దుష్ట సంహారం చేసి

"విజయ పరంపరతో"
వేదనిలయ మాతృభూమికి 
అంకితమిస్తా.


కామెంట్‌లు