పాలఖండ్యాం బడిలో పదిమంది చేరిక

 పాఠశాల పునఃప్రారంభమైన నేడు ఒకటో తరగతిలో పదిమంది పిల్లలు నమోదైనట్లు ప్రధానోపాధ్యాయని రుద్రపాటి లక్ష్మీ కుమారి తెలిపారు. తొలుత స్థానిక అంగన్వాడీ కార్యకర్త నుండి ఐదేళ్ళు నిండిన ఒకటో తరగతికి అర్హతగల పిల్లల వివరాలను సేకరించగా, మరో వైపు గ్రామంలో పర్యటించి గ్రామంలో పర్యటించి మరికొందరి వివరాలను సేకరించామని ఆమె అన్నారు. శనగల వెంకట లక్ష్మి అప్పలనాయుడు దంపతుల కుమారుడు వరుణ్ తేజ్, కొర్నాన లక్ష్మి రమణ దంపతుల కుమార్తె తేజేశ్విని, డొప్ప జయలక్ష్మి, రామరాజు దంపతుల కుమారుడు బాలు తదితరులు ఒకటో తరగతిలో నమోదైరి. ఈ పర్యటనలో ప్రధానోపాధ్యాయని రుద్రపాటి లక్ష్మీకుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ,  వెలగాడ రాము, భూసిరెడ్డి కృష్ణవేణి, చిప్పాడ భవాని, జిఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు. వీరితోపాటు గ్రామ సచివాలయం కార్యదర్శి దూబ రంజిత్ కుమార్, గ్రామ పెద్దలు పెద్ది సత్యం, పలిశెట్టి సూర్యనారాయణ, అంగన్వాడీ కార్యకర్త కుప్పిలి లక్ష్మి, బాలబడి కేంద్ర బోధకురాలు దారబోయిన జ్యోతి, ఆయా గుంటిబాని చిన్నమ్మడు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు