నిన్నటి వెతలకు అడ్డు వేసి
రేపటి కలల వైపు తెడ్డు వేసి
నేటి నడకను నిర్ణయించు!
మాటలు మౌనంగా మార్చి
బాటలు చేతలతో తీర్చి
ఓటమి ఎరుగక సాగిపో!
కోటి ప్రశ్నలకు జవాబుగా
మేటి విజయం ఫలితంగా
సాటి పోటీ లేకుండా గెలిచి చూపు!
మాయల జాలానికి అందక
లోయల అంచున నడకలా
ఛాయగా కలతలు దాటిపో!
నిజము నీడన బ్రతుకు బండికి
ఋజువులేవీ లేకపోయినా
విజయం తప్పదు తెలుసుకో!
తల వంచని నిర్ణయాలు
తలపొగరనిపించినా.. ఫలితాలు
తలచుకొంటారు తెలుసుకో!
నిన్ను నీవు మలచుకునే
చిన్న చిన్న మార్పులయినా
ఉన్నతంగా నిలుపుతాయి గుర్తుంచుకో!
పడ్డ కొమ్మ కూడా ఆపలేదు
ప్రవాహపు దారిని....కొంచెమైనా
కొత్తమలుపుల పాఠమేదో పొంచి వున్నది
తెలుసుకోమంటున్న వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి