సాటిలేదు సాంబారు ఇడ్లీ:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
 ఇంటిల్లి బాదికి
ఇష్టమైన అల్పాహారం
ఇంటి ఇల్లాలు గాజుల చేతితో
అలా తింటే ఎలా అని
కరివేపాకుపోడి, చట్నీ
వేడి, వేడి సాంబారు తో
తినాలి అంటే
అలాగే అని అరడజను 
అరచేతంత ఇడ్లీలు
అరవై ఏళ్లయి తింటున్నా
ఆఫీస్ కెళ్ళి అరమూత పడే కళ్ళను తుడుచుకునే రోజులవి.
ఇప్పుడు ఎంచక్కా తాపీగా
అనుస్థానం అయిన వెంటనే
ఆస్వాదిస్తూ లాగిస్తుంటే
ఆ ఆనందం వర్ణింపతరమా
ఆసియాలో నే అత్యంత పోషక అల్పాహారం ఇడ్లీ అన్నప్పుడు
అంతేగా తాతయ్యా అంటు
ఆవిరి వస్తున్న సాంబారు ఇడ్లీ నాతో బాటే లాగిస్తు
కాలేజిలో చదువుతున్న మనుమడు
సాటిలేదు ఏది నానమ్మ చేసిన సాంబారు ఇడ్లీ అని
నీ ఆరోగ్య రహస్యానికి కారణం తెలిసింది తాతయ్య అంటే
అరవై ఏళ్లయి  నాతో కాపురం చేస్తున్న మా ఇంటావిడ నావేపు చూసిన చూపును చూసి
అవును నిజమే కదా అనుకున్నాను....!!
..........................

..........................

కామెంట్‌లు