భాగ్యనగరం కవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాదుకు విశ్వపుత్రిక గజల్ సంస్థ పురస్కారం

  సుందరయ్య విఙ్ఞాన కేంద్రం హైదరాబాదులో ఆదివారం జరిగిన విశ్వపుత్రిక గజల్ సంస్థ వార్షికోత్సవ సమావేశంలో కవి భాగ్యనగరం నివాసి గుండ్లపల్లి రాజేంద్రప్రసాదుకు గజల్ పురస్కారం ప్రదానం చేశారు. సభకు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షత వహించారు. సభకు పెక్కుమంది సాహితీ ప్రియులు హాజరుకావటం చాలా సంతసాన్ని ఇస్తుందన్నారు. పిమ్మట సంస్థ అధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మిపండిట్ గజల్ కవులను ప్రోత్సహించటానికే సంస్థను స్థాపించామన్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నరసింహప్ప సంస్థ క్రమం తప్పకుండా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. సభకు అతిధులుగా ప్రముఖ కవి ఖమ్మం వాసి మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ గజల్ కవి సురారం శంకర్, కవి విశ్రాంత  ఐ.ఆర్.ఎస్.  
అధికారి జెల్ది విద్యాధర్, సహస్ర సినీ టీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, కవి రచయిత జర్నలిస్ట్ భగీరథ మొదలగు వారు పాల్గొన్నారు. 
కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధా కుసుమ గొప్పగా కవిసమ్మేళనం నిర్వహించి అందరి మన్ననలను పొందారు. కవిసమ్మేళనంలో మొదటగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ నా ఒయ్యారిని అనే గజల్ పాడి శ్రోతలను అలరించారు. కవులందరు మంచి కవితలను చదివి ఆకట్టుకున్నారు. గజల్ పురస్కార గ్రహీత రాజేంద్రప్రసాద్ ను శాలువాకప్పి, ప్రశంసాపత్రమిచ్చి, మెమెంటో అందజేసి న్రసింహప్ప, బిక్కి క్రిష్ణ, విజయలక్ష్మిపండిత్, జెల్ది విద్యాధర్ ఘనంగా సత్కరించారు.
కార్యక్రమం చక్కగా నిర్వహించి, ఘనంగా సన్మానించినందుకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌లు