సనాతన ధర్మానికి ,వేదవాఙ్మయనికి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ లోని పవిత్రగోదావరి ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరంలో విద్యావాచస్పతి, దర్శన అలంకార, పండితరత్న మహా మహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి దంపతుల చే కవి, రచయిత ,సనాతన ధర్మ పరిరక్షణ చేస్తు మానవత్వమే మాధవత్వమని రచనలద్వారా చెప్పే , సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ దంపతులను ఆశీర్వదిస్తు దుశ్శాలువ, పూలదండ నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. బదులుగా ప్రసాద్ మాష్టారు సరస్వతీ మాత ప్రతిరూపమైన వేదస్వరూపులు, శృంగేరి ,కంచి పీఠాధిపతుల సన్నిహితులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి దంపతుల ఆశీర్వచన ఆత్మీయ సత్కారం జీవితాన మరువలేనిదని పూర్వజన్మ సుకృతమని తెలియచేసారు..!!
...............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి