క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ - యామిజాల జగదీశ్

 చరిత్రలో 1868 జూన్  23వ తేదీన క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ టైప్‌రైటర్‌కు పేటెంట్ పొందారు. ఈ విప్లవాత్మక ఆవిష్కరణ ఆఫీసు పని, వ్రాతపూర్వక కమ్యూనికేషన్‌ను శాశ్వతంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. దీనిని "టైప్-రైటర్" యంత్రం అని పిలిచేవారు. ఈనాడు మనం ఉపయోగించే కీ బోర్డులకు ఈ టైప్ రైటర్ కీ బోర్డే పునాది.
షోల్స్ ఆవిష్కరణ వేగవంతమైన, మరింత సమర్థవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు  వీలు కల్పించింది. వ్యాపార రంగంలో విరివిగా వినియోగించారు.  టైప్‌రైటర్ సాహిత్యం, జర్నలిజం, రికార్డ్ కీపింగ్ కోసం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచింది. దాని ప్రభావం ఇప్పటికీ మన ఆధునిక డిజిటల్ ప్రపంచంలో కనిపించడం విశేషం.

కామెంట్‌లు