అక్షరాలపరవశాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
అక్షరాలు
అందితే
అదృష్టము
ఆనందము

అక్షరాలు
అమరితే
ప్రాసలసొంపు
వీనులకింపు

అక్షరాలు
పారితే
పదాలపసందు
పొంకాలకనువిందు

అక్షరాలు
వెలుగులుచిమ్మితే
అంధకారాంతము
అఙ్ఞాననిర్మూలము

అక్షరాలు
చిక్కితే
ప్రయోగించాలి
దుమ్ములేపాలి

అక్షరాలు
కనబడితే
అదరగొట్టాలి
మదులముట్టాలి

అక్షరాలు
పూస్తే
అందాలుచూపాలి
ఆనందమివ్వాలి

అక్షరాలు 
ప్రేలితే
హృదయాలనుతట్టాలి
మనసులనుమేలుకొలపాలి

అక్షరాలు
కరుణించితే
కలసొచ్చినదృష్టమనుకోవాలి
వాణీదేవివాత్సల్యముగాచూడాలి

అక్షరాలు
అర్ధాలనుస్ఫురిస్తే
ప్రయోగనీయము
ప్రశంసనీయము

అక్షరాలు
సౌరభాలుచల్లితే
ఆఘ్రనీయము
అనుభవనీయము

అక్షరాలు
తేనెచుక్కలుచల్లితే
రుచిచూడాలి
తృప్తిపొందాలి

అక్షరాలు
అమృతంచిందితే
ఆస్వాదించాలి
అమరునిగానిలవాలి

అక్షరాలు
పరవశపరిస్తే
పుణ్యముదక్కిందనుకోవాలి
పురుషార్ధముసాధించామనుకోవాలి


కామెంట్‌లు