పాలఖండ్యాంలో విద్యార్ధి మిత్ర కిట్స్ పంపిణీ

 పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర కిట్స్ పంపిణీ గావించామని ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్. కుమారి తెలిపారు. ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకూ 52మంది పిల్లలకు పాఠ్య పుస్తకాలు, బేగ్ లు, నిఘంటువులను, మరియు ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు 52మంది పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ నిఘంటువులను అందజేశామని ఆమె తెలిపారు. విద్యార్థులకు ఈ సామగ్రిని సర్పంచ్ దారబోయిన రెయ్యమ్మ, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ చాంతాటి లక్ష్మి, గ్రామ పెద్దలు పలిశెట్టి సూర్యనారాయణ, డి.ధర్మరాజుల చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి,, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, జిఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు. వీరితోపాటు అంగన్వాడీ కార్యకర్త కుప్పిలి లక్ష్మి, బాలబడి కేంద్ర బోధకురాలు దారబోయిన జ్యోతి, ఆయా గుంటిబాని చిన్నమ్మడు, సయ్యద్ సబీనా, ఎస్.సమీరా, డొప్ప హేమలత, పిల్లల షర్మిళ, గుంటుబాని నందిని, జి.సుధ,  కరగాన శ్రావణి, కరగాన పావని, పిల్లల మహేష్, జి.గిరిధర్, కోరాడ ధనుంజయ, డొప్ప దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు