ఆకాశంలో అలవోకగా జరిగే
అద్భుతం కారణంగా
అవనిలో అణువణువూ
అపురూప చైతన్యం
మౌనంగా ఎదురుచూసే
సుధీర్ఘమైన చీకటి రేయికి
కమ్మని కానుకగా దొరికే
అమూల్యమైన వరం!
తల్లడిల్లే తలపులకు
తాత్కాలికంగా తలుపు వేసి
తప్పనిసరి పరుగులకు
తయారవమనే సూచన!
నల్లగ మారిన నింగిలో
చమకుమనే తారలన్నీ
వెలుగు చాటున దాక్కునే
చుక్కలాడే దొంగాట!
కూతురుపై కడలంత ప్రేమను
ఎదలో దాచిన తండ్రిలా
వరిమడిలో నిలిచిన నీట
కనిపించే వెలుగుల ఊట!
తెలియని తాయిలమేదో
తొలి కిరణపు పల్లకిపై
ఇలకోసం పంపే ఇనుడికి
ఇష్టంగా వందనం చేస్తూ
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి