ఆర్తత్రాణ పరాయణుడు:-డా.భరద్వాజ రావినూతల-కొత్తపట్నం
సాహితికవికళాపీఠం
సాహితికెరటాలు
===============
నీలవర్ణ మేఘమాలిక, నీలకంఠుని రూపం,...
విషపు కాలకూటముని, మింగిన ధైర్య స్వరూపం....
లోకానికి రక్షణగా, నిలిచిన మహోదాత్తుడు,..
శివశక్తి సముద్రంలో, సత్యపు పరాక్రముడు.‌..

హలాహలాన్నికంఠంలో దాచిన ఓ మహాశయుడు,..
దుఃఖాన్ని దూరం చేసి, దయామయుడై నిలిచెడు...
విషాన్ని మింగినప్పటికీ, విషాదం నెరుగని మనసు,..
ప్రపంచానికి ఆదర్శంగా, నిలిచిన మహోన్నత స్వరూపం...

నీలకంఠుడి నామములో, నిత్య స్ఫూర్తి వెలుగుతుంది,..
అడుగడుగున ఆశయాలకు, ఆత్మవిశ్వాసం కలుగుతుంది....
ప్రతిబంధాల పర్వతాన్ని, ఓర్పుతో అధిగమించు,...
నీలకంఠుని మార్గాన్ని, నీవు కూడా అనుసరించు....

విషపు బాధలొచ్చినా, వికసించు పద్మమవు,..
ధైర్యమనే కంఠములో, దివ్యత్వాన్ని చేరవు...
నీలకంఠుడి జీవితం, నీకు మార్గదర్శకం,...
ప్రేరణగా నిలిపే ఈ కవిత, నీకు శుభోదయం!...

కామెంట్‌లు