ఔను- జయా
ఔను
నేను పుస్తక ప్రేమికుడనే 

నా చేతి వేళ్ళు పుస్తకాన్ని స్పర్శిస్తూ ఉంటే 
మనసుకెంతో  ఆనందం 

పుస్తకంలోని 
ప్రతి పేజీ
ప్రతి మాటా
ప్రతి వాక్యం 
పనికొచ్చేవే
విరామచిహ్నాలు సైతం
 
అర నిండా 
పుస్తకాలు ఉంటే 
మాటలకందని ఆనందం

 గ్రంథాలయాలంటే 
ప్రీతి
 
పుస్తకాల దుకాణాలన్నా
ప్రీతి
అందులోనూ
పాత పుస్తకాలు మాత్రమే చోటు
మరీ మరీ ఇష్టం

పాత పుస్తకాల వాసన
నాకు మత్తు కల్పిస్తాయి
ఆ మత్తు అసాధారణం

పుస్తకాలు లేని
జీవితాన్ని 
ఊహించలేదు

నేనిలా అంటుంటే
నన్ను పిచ్చోడని
మాట్లాడుకునే వాళ్ళున్నారు
మొహం మీదే 
హేళనగా నువ్వే వారూ నాకెరుకే
అయినా
అటువంటి వారి గురించి తలవడం 
కాలాన్ని వృధా చేసుకోవడమే సుమీ


కామెంట్‌లు