సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు=============పచ్చదనంతోనిండుగా కనిపిస్తూ,కనువిందు చేస్తుంటారు.మిమ్మల్ని నిర్ధాక్షిణ్యంగా నరికేసి,వ్యాపారానికి వాడుకుంటున్న మూర్ఖులం.వర్షాభావపరిస్థితుల కారణంగా,నెర్రలు విచ్చిన నేలతో భూమాత విలవిల్లాడు తోందని తెలిసినా..కనికరంలేనికసాయివాళ్ళమైపోతున్నాం.పంటలు పండక రైతులు ఆత్మహత్యలుచేసుకుంటున్నా,మాకేమి పట్టనట్లు చలవ గదుల్లో సంబరాలు జరుపుకుంటున్నాం.ప్రాణ దాతలారా!మీరే మాకు ప్రాణవాయువునిచ్చే ప్రాణదాతలు అని మరచిపోతున్నాం.పర్యావరణ పరిరక్షణ కు మీరే ఆలవాలమని మరచిపోతున్నాం.రైతుల మనస్సులో ఆత్మ విశ్వాసం నింపినెర్రలు విచ్చిన నేలపై ఆకుపచ్చని తివాచి పరిచే దేవ దూతలు మీరే.ఈ భువిని సస్య శ్యామలం చేస్తూ,పశుపక్ష్యాదులకు కూడా కడుపునింపే అన్నపూర్ణలు మీరే.పశు పక్ష్యాదులకు ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునేది మీరేకదా!ఔషధగుణాలతో నిండి, మా ఆరోగ్యాన్ని కాపాడే వనదేవతలు మీరేనమ్మా!కనికరం లేని మనుషులం --మేము కూర్చున్న కొమ్మని మేమే నరుక్కుంటున్నాం.మిమ్మల్ని నరికేసి,బహుళఅంతస్థులునిర్మించుకుంటున్నాం.నీరులేక,గాలి లేక అలమటిస్తున్నాం.ప్రాణదాతలారా! మన్నించండి!!
ప్రాణదాతలారా!మన్నించoడి!:- డా జి భవానీ కృష్ణమూర్తి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి