కరోనా కష్టం... :- నామ వెంకటేశ్వర్లు,-S A తెలుగు - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, -అయిటిపాముల,

 బజారుల పచారులు చేయక 
 బుద్ధిగా ఇంట్లో బజ్జో 
 వెలుపలకి వెళ్లినా 
 గుంపుల కలవక ఒంటిగనుండము 
 ముక్కుకు మాస్క్ ధరించు
 కనబడినవారికి చేతులొగ్గి
 నమస్కారమిడుము చేతులు 
   కలపక 
 భౌతిక దూరము ఒక మీటరుం డుము 
 తుమ్మినా....... దగ్గినా.......
 చేయి మడత పెట్టుము 
 తిను త్రాగు వేళ ముక్కు నోరు కండ్లు తాకు వేళ 
 మరువక హ్యాండ్ వాష్ చేయుము 
 లాకు డౌను అనగానే........ కూరలు కిరాణ మంచు 
 వేగము ప్రదర్శించి..
కరోనను పిలువకు 
కలో గంజో తాగి, కారం పచ్చడితో 
తింటూ కదలకుండనుండుము 
దూరదర్శన్ చూస్తూ 
పిల్లలు సతి/పతి తో   సదనమున  సరదాగా గడుపుము 
చదరంగం అష్ట చమ్మ పచ్చీసు
పులి జూదము దాడులనే ఆలాటాలాడుచు 
 కుటుంబంతో కలిసుండు 
ఇంట్లో కాలం గడుపు 
ఇంత మంచవకాశం
ఎన్నటికి  రాదు నీకు 
అందరి ఆరోగ్యమాశించి 
ప్రభుత్వ సూచనలు పాటిస్తూ 
కరోనా ను బందించి ఒంటరి చేసి 
కరోనా కే కష్టాలు పెడదాం.
=================
కామెంట్‌లు