మా కై సేవలు చేసె;- నామ వెంకటేశ్వర్లు, -S A తెలుగు - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, - అయిటిపాముల,
 మాకై సేవలు చేసె 
 డాక్టర్లారా... నర్సుల్లారా.... పోలీసు ల్లారా.....
 పారిశుద్ధ్య కార్మికులారా.......!
 కరోనా వైరస్ నుండి
 కాపాడే ధీరులారా........   "2సా "

 భరతభూమి  కడుపున 
 పుట్టిన ఓ యోధులారా 
 పేషంట్ల సేవలకై 
 తను ఒడ్డిన ఘనులారా...   " మాకై" 

 మీసేవ భావముతోను 
 మీ ఆత్మీయత మాకు తెలుసెను 
 సకల జనులు నీ త్యాగము 
 మరువలేము మరువలేము 

 కరోన పేషెంట్ల కొరకు 
 చేస్తున్నా మీ సేవలు 
 కరోనా ఉన్నంతవరకు 
 మీ సేవలు మాకుంటే
 ఈ వైరస్ పారిపోవుట తథ్యం    "మాకై "

మీ ఒక్కొక్కరి సేవ తత్వం                 
మా అందరికి  అందుతు ఉంటే                 
మే మెన్నడు అధైర్య  పడమూ    
మాకింకా బాధలు   ఉండవ్          
 కరోనా పై మీ ఉద్రేకాస్త్రం
 మా అందరి కభయాస్తం

 మీరు తీసుకున్న
 ఈ దృఢసంకల్పం 
 మాపాలిటి దీక్ష బంధం 
 కరోనా వైరస్ పాలిటి 
 రుధిర శిక్త యమ పాశం... "మాకై "
(  పేరడీ  కవిత/పాట )


కామెంట్‌లు