శ్రీరామ గీతం: -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
 ప:
వైకుంఠధాముడా… కౌసల్యానందనుడా
ఆనంద నిలయుడా… ఆదర్శప్రాయుడా
అయోధ్య పుర వాసుడా… అందాల దేవుడా
మా బాల రాముడా … బ్రహ్మాండ రూపుడా!
॥వైకుంఠ॥
1 చ:
సుప్రభాత వేళ… స్తుతియింతుము శ్రీరామా
ప్రభాత సమయమాయె… పరికించగా లెమ్ము
పరివార సహితమై… పాలించగా రమ్ము
సర్వ జగద్రక్షకా…శుభ చరితామృత నామా!
॥వైకుంఠ॥
2 చ:
అవనిజ పతి సర్వేష్టీ… అఖిలాండ తేజస్వీ
భక్త హృదయ విహారీ … భవ తారక రామా!
ప్రణతులను అందుకో… పరమ పూజ్యనామా
శ్రీ పరంధామా… ఓం శ్రీరామ రామ రామా!
॥వైకుంఠ॥


కామెంట్‌లు