డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నలక్ష్మికి అక్షర కణిక - 2025 పురస్కారం

 కడప జిల్లా జమ్మలమడుగులో గాలేరు నగరి సుజల స్రవంతి కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఎస్. రత్నలక్ష్మికి అక్షర కణిక - 2025 పురస్కారం లభించింది. హైదరాబాద్ డిఐఎంసి డాన్స్ స్టూడియోలో కణిక సాహిత్య సామాజిక సేవా విద్యారంగం వేదిక వారు కణిక ఆత్మీయ కలయికను ఆదివారం నిర్వహించారు. ఆ సందర్భంగా కణిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి రమాదేవి కులకర్ణి, తులసి వెంకటరమణాచార్యులు, మూర్తి శ్రీదేవి, పొర్ల వేణుగోపాల్, లక్ష్మీ పద్మజ చేతుల మీదుగా ప్రముఖ కవయిత్రి ఎస్. రత్నలక్ష్మిని అక్షర కణిక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. కవయిత్రి ఎస్. రత్నలక్ష్మి మాట్లాడుతూ తన సాహిత్య సేవలను గుర్తించి అక్షర కణిక పురస్కారం ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహోద్యోగులు బంధుమిత్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు