4000 కవితలు వ్రాసిన పోలయ్య కవి కూకట్లపల్లికి "ఒకే రోజు రెండు" సన్మానాలు
 శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  ఆదివారం జరిగిన రెండు "పుస్తకావిష్కరణ" సభలకు కళారత్నడాక్టర్ బిక్కికృష్ణ అధ్యక్షత వహించగా...కవి సమ్మేళనాలకు డాక్టర్ రాధ కుసుమ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఉదయం...విమల సాహితీ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు డాక్టర్ జల్దీ విద్యాధర్ వ్రాసిన "విహంగ వీక్షణం" వ్యాస సంపుటిని 
ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు...
ఈ సభలో కవి సమ్మేళనంలో పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని..."ఎగరలేని పక్షి...ఎదగలేని 
మొక్క"...అను శీర్షికతో కవితా గానం చేశారు.
సాయంకాలం...విశ్వ పుత్రిక గజల్ ఫౌండేషన్ మరియు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గజల్ 
రచయిత్రి విజయలక్ష్మి పండిట్ వ్రాసిన 
"హిందీ గజల్ అనువాద పుస్తకాన్ని" ముఖ్య
అతిథి పూర్వ ఇన్కమ్ టాక్స్ కమిషనర్
ఎం. నరసింహప్ప...ఆవిష్కరించారు.
ఈ సభలో కవిసమ్మేళనంలో పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని"అందమెక్కడున్నది" ?
శీర్షికతో  "అన్న నందమూరి" పై కవితా
గానం చేసి అందరినీ అలరించారు
ఈ రెండు సభల్లో అనేక మంది కవులను కవయిత్రులను సామాజిక కార్యకర్తలను కళాకారులను ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా పోలయ్య కవి కూకట్లపల్లి మాట్లాడుతూ ఈ రెండు సభల్లో తాను 
"కవితా గానం" చేసినందుకు...దాదాపుగా
4000 లకు పైగా కవితలు వ్రాసినందుకు..
గుర్తింపుగా...కళారత్న డాక్టర్ బిక్కికృష్ణ...
డాక్టర్ జల్దీ విద్యాధర్...ఎం. నరసింహప్ప..
డాక్టర్ విజయలక్ష్మి పండిట్...డాక్టర్ మునగా రామ్మోహన్ రావు...మువ్వా శ్రీనివాసరావు తదితర సాహితీమూర్తులు పోలయ్య కవి కూకట్లపల్లిని ఘనంగా సత్కరించారు...
అందుకు ప్రతి ఒక్కరికీ పోలయ్య కవి 
కూకట్లపల్లి కృతజ్ఞతలు తెలియజేశారు...
ఈ రెండు సభలకు భగీరథ...మౌనశ్రీ మల్లిక్...సురారంశంకరం...వెంకటదాసు..
సరికొండ నరసింహ రాజు... శైలజా మిత్ర...
కవులు కవయిత్రులు...విమల సాహితీ సమితి సభ్యులు...హాజరయ్యారు. మధ్యాహ్నం 
డా.జల్ధీ విధ్యాధర్ "కమ్మని విందును" ఏర్పాటు చేశారు...ఈ రెండు సాహితీ సభలు కవులకు 
మరిచిపోలేని ఒక తీపిజ్ఞాపకమే.


కామెంట్‌లు