సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
==============
అలల తాకిడి అధికమైనను
ఆటుపోట్లును ఎదుర్కొని
నావికుడు నావను సురక్షితంగా గమ్యానికి చేర్చినట్లు...
పేదరికంలో మునిగి తెలుతున్నను
బతుకు భారమై జీవనం దుర్లభ మైనను...
ఓర్పు, సహనంతో అంతే లేని జీవన పయనాన్ని కొనసాగించాలి
అలుపు సోలుపు ఎరుగక లక్ష్య సాధన దిశగా...
మొక్కవోని మనోధైర్యంతో ముందడుగు వేయాలి!
తననే నమ్ముకుని జీవితనౌకలో పయనించే కుటుంబ నావికులకు ఆత్మబలాన్ని చేకూర్చుతూ...
విశ్వాసాన్ని సమకూర్చుతూ...
భారమైనను బతుకు భారాన్ని మోస్తూ...
నిత్య శ్రామికుడిలా జీవిత భారాన్ని జీవించినంత కాలం మోయాలి
జీవిత సంగ్రామంలో విజేతలై నిలవాలి!!!
*********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి