లక్ష్యం:- యం.రమేష్-8 వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -రేగులపల్లి-మం.బెజ్జంకి
 అనగనగా ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు తన కుటుంబం చాలా పేదవారు. తను చాలా బాగా చదువుతాడు అలా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నాడు అలా చదువుతూ పదవ తరగతి పరీక్షలు వచ్చాయి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు తనకు డాక్టర్ అవ్వాలని కోరిక డాక్టర్ చదువు కోసం చాలా డబ్బు అవసరం తన కుటుంబం పేద కుటుంబం తన లక్ష్యం కోసం ఇంటర్లో బైపిసి తీసుకున్నాడు ఒకవైపు డబ్బు లేకపోయేసరికి ఒకవైపు చదువుతూ మరోవైపు హోటల్లో పనిచేస్తూ  డబ్బు సంపాదించాడు .ఇంటర్ పరీక్షలు వచ్చాయి ఆ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. పాసయ్యాడు తర్వాత కొన్ని రోజులు పనిచేసే డబ్బు సంపాదించుకున్నాడు. వాళ్ళ ఇంట్లో అమ్మానాన్నలకు డబ్బులు పంపించాడు నేను డాక్టర్ అవ్వాలి అన్న కోరికతో చదివాడు డాక్టర్ కు సంబంధించిన పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాడు .దానివల్ల మంచి కాలేజీలో సీటు వచ్చింది.తన కోరిక నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు చివరకు డాక్టర్ అయ్యాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలకు తాను డాక్టర్ అయ్యాను అని చెప్పాడు. వాళ్ళ అమ్మానాన్నలు చాలా సంతోషించారు రాము  వాళ్ళ ఊరిలో ప్రజలకు ఉచిత సేవలు అందిస్తూ  పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడిపారు

నీతి. పేదరికం లక్ష్యసాధన కు అడ్డు కాదు

కామెంట్‌లు