మొక్కలు నాటుదాం ...: - రవీందర్ ఆడెపు-9059396611
పల్లవి 

చెట్టూ,  చేమా పచ్చదనంతో 
ప్రతి జీవీ క్షేమం
చెట్లు లేకుంటే వర్షం రాక కలుగుతుంది క్షామం

అనుపల్లవి

ప్రతి ఒక్కరం పది మొక్కల్ని
నాటగ అంతా మనం!
ప్రతి ఒక్క ఊరు తప్పక 
అవుతుందీ హరిత వనం!

                               పల్లవి
చరణం 1 
పాడువాయువు పీల్చుకుని
ప్రాణవాయువు అందిస్తూ 
పరిసరాల పరిరక్షణ చేసే
పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని !

ప్రతి ఒక జీవి మనుగడ అనేది
ప్రకృతితో ముడిపడి ఉందని
ప్రతి ఒక్కరూ ఇంటి పరిధిలో
పచ్చని మొక్కలు నాటుదాం !
   
                     అనుపల్లవి 
                          పల్లవి

చరణం 2
పరుగున సాగుతూ వేగంగా
ప్రవహించే వర్షపు జలాలను
పుడమి లోనికి ఇంకేటట్టుగ
పచ్చని చెట్లే పని చేస్తాయని!

పుట్టినపాపకు ఊయలనుండి
పండుముసలికి ఊతంవరకు
ప్రాణం పోతే పాడెకు కాడెకు 
ప్రతి మనిషికవసరం కట్టెతోనని
                       అనుపల్లవి
                             పల్లవి

కామెంట్‌లు