విశ్వ ప్లాస్టిక్ నిషేధం! జనక్షేమ అశ్వమేధం!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
 నా పంచపదుల సంఖ్య---
    1755-1758.
1755.
పర్యావరణ పచ్చదనం, భూమాత నిండు పైటకొంగు! 
ప్లాస్టిక్ వ్యర్ధాల బరువులు, మోస్తుంటే మరి చిరుగు!
వ్యర్ధాలే గోవర్ధనాలైతే, 
కృష్ణుడే వెనుక అడుగు! 
భూమి నందనవనాల?
ప్లాస్టిక్ శోకవనాలెదుగు!
గాలి, నీరు, నేల తప్పక, క్రమేపీ కాలుష్యం పాలగు,
పివిఎల్!
1756.
పంచభూతాల్ని శాసిస్తున్న,
 ఈయుగ పెనుభూతమిది! 
భూమిపై పొరలు, పొరలు, పెరిగి విస్తరిస్తున్నది! 
నీటిలో కరగని మలినమై,
పేరుకొనియున్నది!
అగ్నిలో కాలితే గాలిలో, విషవాయువై వీస్తున్నది! 
ఆకాశమంత ఎత్తు ఎదిగే ,
ఆరోభూతమై ఉన్నది, పివిఎల్!
1757.
శాస్త్రీయ ఆవిష్కారము,
 మరి ఆకర్షణ అపారము! 
అన్ని రంగాల ప్లాస్టిక్, వస్తువులు వాడుక నిత్యము! 
పగలని, పలురూప ,
వివిధ రంగుల దర్శనము!
ప్యాకింగ్ లో ప్లాస్టిక్ కవర్లు, 
మనకి అనివార్యము!
వేసినప్పుడు వేపకొమ్మ ,
మరి, తీయాలంటే ఆశిరమ్మ, పివిఎల్!
1758.
నేడు పర్యావరణ పరిరక్షణ,
 తక్షణోద్యమము!
అతి సర్వత్ర వర్జయేత్,
ప్లాస్టిక్ వర్జన శీఘ్రము!
వస్త్రం, కాగితం  వాడుక, ప్రత్యామ్నాయలు అవసరము!
రీసైక్లింగ్ ప్లాస్టిక్లు, అమలయ్యే,కఠిన శాసనము!
విషం మరిగి హాలాహలం,
ప్లాస్టిక్ పెరిగి కల్లోలం,
పివిఎల్! 
________


కామెంట్‌లు