నాగుల పంచమి:- జాధవ్ పుండలిక్ రావు పాటిల్,-భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ-9441333315

పన్నగేంద్ర
పద్యాలు

నాగుల పండుగ రోజున
నాగుల పుట్టలకువెడలి నమసుల్ జేసీ
బాగుగ పాలను బోసిన
బాగు పడును బ్రదుకులెల్ల పలువిధములుగా

పాముల పూజలు నిత్యము
భామలు జేయంగ సిరులు పంచును యెంతో
పాములు లోకుల నెప్పుడు
క్షేమము నుంచంగ  మనసు ఖేదము దీర్చున్

నమ్మిన వారల నెప్పుడు
కమ్మగ జూచును దయగల గరుడగమనుడై
అమ్మల ననుదిన మిలలో
కొమ్మలు మది నాగరాజు కోర్కెలు తీర్చున్
భక్తపారిజాత పన్నగేంద్ర!

పూజజేయ వనిత పుట్ట దరికివచ్చు
కస్సుబుస్సు యనక కనికరించు
పిల్లజల్లనెల్ల సల్లగా జూడుము
భక్తపారిజాత పన్నగేంద్ర!

పడతులెల్ల నీకు పాలను పోసేరు
భక్తితోటి మొక్కి భజనజేసి
ఆటపాటతోటి యర్చనజేసేరు
భక్తపారిజాత పన్నగేంద్ర!

ఇలను వెలసినట్టి ఇలవేల్పు నాగేంద్ర
సిరులు నిచ్చు దేవ శివుని మిత్ర
వినుము జనుల వినతి వీనుల విందుగా
భక్తపారిజాత పన్నగేంద్ర!

కామెంట్‌లు