"బాల్యం ఓ మధురం":- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట - చరవాణి: 9490904976
 బాల్యం అమృతతుల్యం.
బిడ్డలపై మాతృ వాత్సల్యం..
అమూల్యం, సాఫల్యం..
బడి, గుడి..
అమ్మ ఒడి, ఒరవడి..
నుదుటపై పెట్టే నామాలు,
పలకపై దిద్దే ఓనామాలు
అమ్మ పాట..
నాన్న బాట..
గురువు మాట. 
చదువు పూదోట..
స్నేహితులతో ఆట..
పిల్లల పాటలు, మాటల మూటలు..
కేరింతలు, కుప్పిగంతులు..
కప్పగెంతులు, అన్నిటికీ వంతులు.
అరుపులు, మూతి విరుపులు ..
చెరువులు, వచ్చాక దరువులు..
కురుపులు, ఒరుపులు ..
బంతాట, గుంతాట..
వానాట, దొంగాట..
పీకులాట, వాదులాట..
నేలాబండాట, దోబూచులాట..
గల్లీలో  గోలీలాట
గ్రౌండ్లో గాలిపటాలాట..
చక్రాలాట చుక్కలాట..
బిల్లా దండి ఆడుకుందాం రండి..
లోకమంతా మాదేనండి 
ఆనందాలు, అనుబంధాలు..
పెద్దలచే సుద్దులు, బుద్ధులు..
ఎక్కువగా ముద్దులు,
అప్పుడప్పుడు గుద్దులు..
వెళ్లొద్దని హద్దులు, తిరగకు వేళ పొద్దులు..
మరపురాని రోజులు..
ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతులు


కామెంట్‌లు