అల్లూరి సీతారామరాజు:- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)-సారవకోట - 9490904976
 మన్యం వీరుడు..
విప్లవ ధీరుడు..
సాయుధ పోరాట యోధుడు..
గిరిజనులకు చైతన్య నాథుడు..
ఆటవిక జాతులకు ఆపన్నశీలి..
బ్రిటీష్ పాలకులను భయపెట్టిన ధీశాలి.
మహోన్నత వ్యక్తి..
మహోజ్వల శక్తి..
అమాయకులపై జరుగుతున్న
ఆగడాలకు అడ్డుకట్ట వేసిన విప్లవ జ్యోతి.. 
మన్యం ప్రజల ఆశా జ్యోతి..
రాజు యోగిగా, ప్రజోపకారిగా.. అల్లూరి సీతారామరాజుగా..
జనుల రారాజుగా గాంచెన్ ఖ్యాతి..
గిరిజనులకు జరుగుతున్న
అన్యాయాలకు, అక్రమాలకు
అడ్డుకట్ట వేసేందుకు వెలసింది  విప్లవ దళం..
బ్రిటీష్ పాలకులకు భయపెట్టిన  గిరిదళం..
తెల్ల దొరలకు తిరుగుబాటు దారుడు అల్లూరి..
తమ(తెల్లొళ్ళ)కు తలపై కత్తిలా తయారైన అల్లూరితో ఎదురెళ్లి తలపడలేక..
తండా ప్రజలపై, విప్లవ సైన్యంపై పిరంగుల దాడి..
అసువులు బాసిన ఎందరో అమాయకులు..
ఆ అలజడితో తనకు తానుగా, తన స్థావరాన్ని తెలిపి, గుడాల్ తుపాకీ గుండ్లకు బలై వందేమాతరం అని "అమరుడైన అల్లూరి సీతారామరాజు."

కామెంట్‌లు