మార్పు అనివార్యమైనప్పుడు!?:- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
మార్పు అనివార్యమైనప్పుడు
మనిషన్నవాడెవడైనా మారుతాడు
ఇంటి బరువు బాధ్యతలు 
తనవికానప్పుడే
దేశ దిమ్మరైతిరుగుతాడు
ఇంటి పెద్ద కాలం చేస్తే
నువ్విక కుటుంబ భారం మోయక తప్పదు 

ఇక్కడ కాలం 
మన అవసరం 
(మనకు)మనుషులకు అన్ని నేర్పుతాయి

పసితనంలోని అమాయకత్వం ,
తెలియనితనం

యవ్వనంలోని ఆకతాయితనం

అన్ని దూరమైపోతాయి

కాలం నేర్పే గుణపాఠం 
బ్రతుకు సేద్యం చేయడం నేర్పుతుంది 

ఇక్కడ ఎవ్వరూ అతీతులు కారు 

అందరూ సామాజికీకరణకు
కట్టుబాట్లకు తలొగ్గి నడుచుకోవాల్సిందే

కాదు కూడదు అంటే 
సమాజమే
మనకు సమానత్వం ఇవ్వదు 

మనమంతా బ్రతుకంతా అనునిత్యం ఏదో ఒకటి నేర్చుకోవలసిందే
చర్యాశీలతే ప్రగతికి సోపానం



కామెంట్‌లు