తీరాలు దూరం కావెపుడూ- కోలా సత్యనారాయణ విశాఖపట్నం 9676623939
సాహితీ కవి కళా పీఠం 
  సాహితీ కెరటాలు
=============
సుదూర తీరాలు కావెపుడూ దూరం...
దరి చేరి అగుపించు, మనసుతో చూస్తే...
అల్లంత దూరాన అగుపించు ఆ నావ,
నా కొడుకునే తెస్తూ ఉన్నాదో, ఏమో!
చిన్ననాటి నుండి చేరువనే ఉండి, 
తరలి వెళ్ళాడు ఉద్యోగ రీత్యా.
భార్యా పిల్లలతో బ్రతుకు గడిపే వాణ్ణి,
రమ్మని కబురంపా,మాతృప్రేమతో.

ఆ నావలో కొడుకు ఉన్నాడో, లేడో?
లేకపోతే,నా హృదయమే విలపిల్లు...
మంచి అమ్మాయిని చూసి చేద్దామంటే,
తన తోటి ఉద్యోగినినే పెండ్లి యాడే.
ఆ పిల్ల గుణగణా లెట్లుండునో, ఏమో!
వచ్చినాక గాని, తెలియదాయే!
అల్లారు ముద్దుగా పెంచిన నా కొడుకు,
ఇబ్బందులెన్ని పడుతున్నాడో అచట!
 కన్న ప్రేమ కదా! నేనేమి చేతు?
బ్రహ్మ రాసిన రాత నే మార్చ గలనా?
దూరాన కొడుకున్నా, నా మనసు అచటే!
నా మనసుకు కాదిది... సుదూర తీరం!!



కామెంట్‌లు