సృష్టికి ప్రతిసృష్టి
మనిషి ఆవిష్కరణల మేధ
గతి తప్పిన క్రతువులో
శ్రుతి మించిన రాగం
ప్రకృతి పరిచిన అందాలు
వొలకబోసే సోయగాలు
వంధ్యశిల కోరిన వరం
కృత్రిమ గర్భం పంచిన ఆనందం
వికటిత కోణాల విచ్చు కత్తి
అమ్మ కొంగులో నేను
సహజంగా ఆడిన మైదానం
కృత్రిమ జననోత్పత్తి కథాకళిలో
మసకబారింది కళల గీతం
విలువలు తప్పిన కృత్రిమ కొంగు వొడి
అపకీర్తి మూర్చనల తీగతెగిన వైద్యపద్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి