తల్లి చెప్పిన పాఠాలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
శ్రమలేని జీవితాన
ఉండవోయ్! ఫలితాలు
ముదం లేని హృదయాన
సుఖాలు గగన కుసుమాలు

సఖ్యత లేని స్థలాన
అభివృద్ధి కడు దూరం
పవిత్రత లేని మనసున
దైవత్వం మాయం

అమ్మ ఉన్న గృహమున
ఆనందం పొంగును
ఆమె చల్లని దీవెన
ఎదుగుదలకు వంతెన

కన్నవారి పలుకులు
గైకుంటే లాభము
కోకొల్లలు శుభములు
భవిత అగును శ్రేష్టము


కామెంట్‌లు