మిత్రుని మాటలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
ఉండరాదు ముల్లులా
ఉండాలోయ్! మల్లెలా
ఉన్న ఊరులో మాత్రం
మిన్నగా బ్రతకాలోయ్!

ఉదయించుము తారలా
ప్రవహించుము యేరులా
పదిమందికి సాయమే
చేయాలోయ్! సూర్యునిలా

నవ్వాలోయ్! పువ్వులా
మ్రోగాలోయ్! మువ్వలా
నలుగురి జీవితాల్లో
వెలగాలోయ్! దివ్వెలా

పెరగాలోయ్! చెట్టులా
కావాలోయ్! గట్టులా
ఉంటేనే కడు మేలు
పోరాడే జట్టులా


కామెంట్‌లు