భరతభూమి వేదనిలయం
సనాతన ధర్మానికి ప్రతీక.
ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి
హిందూవుల తొలిపండుగ
పాలకడలిపై యోగనిద్రలోకి
విష్ణుమూర్తి వెళ్ళే ఏకాదశి
కావున దీనిని శయన ఏకాదశి అని పిలిచెదరు..!!
తెల్లవారుజామున లేచి
అభ్యంగనస్నానాదులు చేసి ఉపవాస, జాగరణలుండి మరుసటిరోజు ద్వాదశి దినాన మహావిష్ణువు ఆరాధన సర్వపాపములను హరించునని భక్తుల నమ్మకం. పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్షపూని లోక సంరక్షణార్ధం
ఒకే ప్రాంతము నుండుట
ఆదిశంకరులు నుంచి ధర్మ పరిరక్షణ గావించటం అనాది గా వస్తున్న ఆచారము........!!
ఏకాదశి అనగా పదకొండు
ఐదు జ్ఞానేంద్రియాలు,ఐదు కర్మేంద్రియాలు,మనస్సు ను ఆధీనంలో ఉంచుకొని ,ఇంద్రియనిగ్రహం కలిగి భగవంతునికి
నివేదన చేయుట ద్వారా
మానవత్వం నుంచి మాధవత్వం వైపుకు జీవుని పయనం సాగును.
సతీ సక్కుబాయి పరమాత్మను చేరిన రోజు.
చైతన్యానికి ప్రతీక యోగనిద్ర. జొన్న పేలాలను
బెల్లానికి కలిపి దంచి పేలపిండిని రైతన్నలు తినే రోజు. పరమ పవిత్రమైన రోజు తొలి ఏకాదశి......!!
.................................
లోకా సమస్తా సుఖినో భవంతు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి