అనుమానం పెనుభూతం:- --గద్వాల సోమన్న, 9966414580
అదిలోనే త్రుంచాలి
ఆవిరిస్తే అనుమానం
అదే కాస్త ముదిరితే 
అవుతుందోయ్ పెనుభూతం

తెస్తుందోయ్ అనుమానం
వెనువెంటనే అవమానం
దూరంగా ఉంటేనే
ఎంతైనా గౌరవం

అనుమానంతో బ్రతుకులు
అగును అతలాకుతలం
ముక్కలగును కుటుంబాలు
కూలునోయ్ కాపురాలు

పెంచుకొమ్ము నమ్మకం
అది కారాదు అమ్మకం
కాల సర్పం వంటిదే
మితిమీరిన అనుమానం


కామెంట్‌లు