పంతులమ్మ బోధనలు:- --గద్వాల సోమన్న, 9966414580
చేసిన మేలు మరువకు
కృతఘ్నత చూపకు
ఎవ్వరికీ వంచన
ఏమాత్రం చేయకు

మదిని బాధ పెట్టకు 
హీనంగా చూడకు
సున్నితమైన మనసులు
మాటలతో పొడవకు

అపనిందలు వేయకు
కీడును తలపెట్టకు
మానవత్వం మరచి
మృగం వోలె మారకు

సద్గుణాలు వీడకు
నాశనాన్ని కోరకు
పదిమంది క్షేమమే
భువిని విస్మరించకు


కామెంట్‌లు